కారు యాక్సిడెంట్ లో బీజేపీ ఎంపీకి గాయాలు…ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

  • Published By: venkaiahnaidu ,Published On : November 10, 2019 / 09:42 AM IST
కారు యాక్సిడెంట్ లో బీజేపీ ఎంపీకి గాయాలు…ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

Updated On : November 10, 2019 / 9:42 AM IST

రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. 

ఢిల్లీ నుంచి నంద దేవీ ఏసీ స్పెషల్ ట్రైన్ లో ఉదయం 4గంటలకు హరిద్వార్ రైల్వే స్టేషన్ లో దిగిన రావత్ 7గంటల సమయంలో అక్కడినుంచి కారులో పౌరీకి బయల్దేరారు. కారులో ఆయన గన్ మెన్,డ్రైవర్ ఉన్నారు. హరిద్వార్-ఢిల్లీ నేషనల్ హైవేపై భీమ్ గొడ-పంట్ దీప్ ప్రాంతం దగ్గర రావత్ ప్రయాణిస్తున్న కారు మరో కారుని ఢీకొట్టింది. ఓవర్ టర్న్ సమయంలో ఈ యాక్సిడెంట్ కు కారణం. ఈ యాక్సిడెంట్ లో మెడ,నడుము భాగంలో తీవ్ర గాయాలతో హరిద్వార్ లోని ఓ హాస్పిటల్ లో చేరిన ఆయనను మెరుగైన ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.