విషాదం : ఉదయం పెళ్లి, సాయంత్రానికి వరుడు మృతి

విషాదం : ఉదయం పెళ్లి, సాయంత్రానికి వరుడు మృతి

Updated On : June 23, 2021 / 1:35 PM IST

Bride Groom Died in marriage day at Ramanathapuram district : పెళ్లి అయి కాళ్లపారాణి ఆరక ముందే, పెళ్లైన ఆరుగంటల్లోనే వరుడు మరణించిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

రామనాధపురం జిల్లా ఇంళంజసోంబూరుకు చెందిన మలై స్వామి కుమారుడు విఘ్నేశ్వరన్(27) కు సయలగుడి సమీపంలోని మార్కెట్ ప్రాంతానికి చెందిన యువతి(22)తో ఈనెల 24వతేదీ ఉదయం గం.10-30లకు ముత్తురామలింగపురం అమ్మన్ ఆలయంలో పెళ్లి జరిగింది. మధ్యాహ్న భోజనాల అనంతరం కొత్త దంపతులు వధువు ఇంటికి వెళ్లారు.

అప్పటికి సాయంత్రం 3 గంటలయ్యింది. అంతా చూస్తుండగానే వరుడు విఘ్నేశ్వరన్ కుప్పకూలిపోయాడు. బంధువులు అతడ్ని సాయల్ కుడి ప్రభుత్వాస్పత్రికి తరలించే మార్గంలోనే కన్నుమూశాడు.  ఆస్పత్రిలో వైద్యులు వరుడు గుండె నొప్పితో చనిపోయినట్లు తెలిపారు. దీంతో ఇరుకుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.