Bride Groom Hydrama Jagityala : ఇష్టం లేని పెళ్లిని వదిలించుకోవడానికి వరుడు హైడ్రామా

ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవాలని చూసిన వరుడికి బంధువులు చుక్కలు చూపించారు. పెళ్లి సమయానికి ఆరోగ్యం బాగలేదని డ్రామాలు ఆడిన ఆ యువకుడిని చితకబాదారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అన్వేశ్‌కు... జగిత్యాలకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది.

Bride Groom Hydrama Jagityala : ఇష్టం లేని పెళ్లిని వదిలించుకోవడానికి వరుడు హైడ్రామా

Bride Groom Hydrama Jagityala

Updated On : August 22, 2022 / 6:31 PM IST

Bride Groom Hydrama Jagityala : ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవాలని చూసిన వరుడికి బంధువులు చుక్కలు చూపించారు. పెళ్లి సమయానికి ఆరోగ్యం బాగలేదని డ్రామాలు ఆడిన ఆ యువకుడిని చితకబాదారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన ఎన్ఆర్ఐ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అన్వేశ్‌కు… జగిత్యాలకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. రూ. 25 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలిచ్చి పెళ్లి చేసేందుకు వధువు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

ఆదివారం వీరి వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెళ్లి మండపానికి చేరుకున్న తరువాత బాత్ రూంలో కాలు జారి పడ్డానని చెప్పి అన్వేశ్‌ ఆస్పత్రిలో చేరాడు. జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి కాలికి బ్యాండ్ వేయించుకున్నాడు. తనకు ఆరోగ్యం బాగాలేదంటూ మరో ఆస్పత్రిలో చేరాడు.

Bhopal : పెళ్లి పేరిట వధువు మోసం..యువకులకు కుచ్చుటోపి

టెస్టులు, స్కానింగ్‌లు చేసి ఏలాంటి ఆనారోగ్య సమస్య లేదని వైద్యులు చెప్పడంతో వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు గంటల పాటు అనారోగ్యం పేరుతో హైడ్రామా ఆడిన వరుడుని… పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు నిలదీశారు. పెళ్లి ఇష్టం లేదని వరుడు అన్వేష్ తేల్చి చెప్పాడు. ఆగ్రహంతో ఊగిపోయిన వధువు బంధువులు పెళ్లి కొడుకును చితకబాదారు.