క్రిస్మస్ వేడుకల్లో మారణహోమం : 115 మంది మృతి
పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు

పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు
పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు చనిపోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. రంగంలోకి దిగిన సైనిక బలగాలు కాల్పులు జరిపాయి. 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం(డిసెంబర్ 24,2019) అర్ధరాత్రి ఈ ఘటన చోటు జరిగింది.
బుర్కినా ఫాసో-మాలి దేశాల సరిహద్దు పట్టణం అర్బిండాలో స్థానికులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఈవ్ వేడుకలు లక్ష్యంగా జిహాదీలు దాడి చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 35మంది పౌరులు చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. క్రిస్మస్ వేడుకల ఆరంభ సమయంలో ఈ ఘటన జరగడం విషాదం నింపింది.
అనంతరం సైనిక బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మందికి పైగా జిహాదీలు హతమయ్యారు. జవాన్లు వీరోచితంగా పోరాటం చేసి 80మంది జిహాదీలను మట్టుబెట్టారు. జిహాదీ గ్రూపులు మరిన్ని ఉన్నట్లు సమాచారం అందడంతో.. సైనిక బలగాలు అప్రమత్తమయ్యాయి. అర్బిండాలో గాలింపు చర్యలు చేపట్టాయి.