Cab Ride Cancelled : క్యాబ్ రైడ్ క్యాన్సిల్ చేసినందుకు మహిళకు అసభ్య వీడియోలు పంపిన డ్రైవర్
ప్రయాణం చేయటానికి బుక్ చేసుకున్న కారులో సౌకర్యాలు లేని కారణంతో, రైడ్ క్యాన్సిల్ చేసుకున్న మహిళను ఆ క్యాబ్ డ్రైవర్ అసభ్య సందేశాలు వీడియోలు పంపుతూ వేధించసాగాడు.

Cab Ride Cancel
Cab Ride Cancelled : ప్రయాణం చేయటానికి బుక్ చేసుకున్న కారులో సౌకర్యాలు లేని కారణంతో, రైడ్ క్యాన్సిల్ చేసుకున్న మహిళను ఆ క్యాబ్ డ్రైవర్ అసభ్య సందేశాలు వీడియోలు పంపుతూ వేధించసాగాడు. మహిళ ఫిర్యాదుతో క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ముంబైలోని బోరివ్లి లో నివసించే మహిళ తన భర్త,మామగారు, దక్షిణ ముంబై వెళ్లేందుకు అక్టోబర్ 3వ తేదీన యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుంది. ఇంటికి వచ్చిన క్యాబ్ డ్రైవర్ అధిక ఛార్జీలు అడగటం… క్యాబ్ లో ఏసీ సరిగా పని చేయకపోవటంతో బుక్ చేసుకున్న రైడ్ ను క్యాన్సిల్ చేసుకుంది.
దీంతో ఆగ్రహించిన డ్రైవర్ ఆమె భర్తను దూషించాడు. అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మహిళ, ఆమె భర్త ఫోన్లకు వివిధ నెంబర్ల నుంచి బెదిరింపులు, అసభ్య వీడియోలు , అసభ్య పదజాలంతో మెసేజ్ లు రావటం మొదలయ్యింది. దీంతో మహిళ ఎల్టీ మార్గ్ పోలీసులను ఆశ్రయించి ఫోన్ నెంబర్లు ఆధారంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులువిచారణ చేపట్టారు.
పోలీసులు ఆ మెసేజ్ లు వీడియోలు క్యాబ్ డ్రైవర్ ఉత్సవ్ కుమార్ ఫోన్ నెంబర్లు నుంచి వచ్చినట్లు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ కోసం గాలించగా అప్పటికే అతను బీహార్ పారిపోయాడు. పోలీసు బృందం బీహార్ వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. మహిళను ఇబ్బంది పెట్టినందుకు నిందితుడిపై ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.