RGI Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టు‌లో కారు బీభత్సం.. నుజ్జునుజ్జయిన రెండు కార్లు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు బీభత్సం సృష్టించింది. ఆగిఉన్న కారును వెనుకాల నుంచి మరోకారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీకొడుతూ ...

RGI Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టు‌లో కారు బీభత్సం.. నుజ్జునుజ్జయిన రెండు కార్లు

Car accident at Shamshabad Airport

Updated On : February 11, 2024 / 11:39 AM IST

Car Accident At RGI Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు బీభత్సం సృష్టించింది. ఆగిఉన్న కారును వెనుకాల నుంచి మరోకారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీకొడుతూ కల్వర్టులోకి దూసుకెళ్లి నుజ్జు నుజ్జయ్యాయి. ప్రమాద సమయంలో రెండు కార్లలో నలుగురు వ్యక్తులు ఉన్నారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

 

ప్రమాదం ఎయిర్ పోర్టు ప్రధాన దారిలో జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.