బ్రేకింగ్ : పేలిన కారుబాంబు.. 12మంది దుర్మరణం

ఈశాన్య సిరియాలో కారుబాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. టర్కీ మద్దతుదారుల అదుపులో ఉన్న నార్తరన్ టౌన్‌లో జరిగిన బాంబుదాడిలో పదిమందికి పైగా మృత్యువాతపడినట్టు సిరియన్ విపక్ష కార్యకర్తలు చెప్పారు.
అల్-బాబ్ టౌన్ లో శనివారం (నవంబర్ 16, 2019) జరిగిన కారుబాంబుదాడిలో 9 మంది పౌరులు సహా 14మంది మృతిచెందినట్టు బ్రిటన్ ఆధారిత సిరియన్ అబ్జర్వేటరీ హ్యుమన్ రైట్స్ నివేదించింది. నగరంలోని ఓ బస్ స్టేషన్ సమీపంలో బాంబు దాడి జరిగిందని, 12 మంది వరకు మృతిచెంది ఉంటారని అలెప్పో మీడియా సెంటర్ కార్యకర్త ఒకరు తెలిపారు.
ఈ దాడి చేసింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కొన్ని నెలలుగా ఈశాన్య సిరియాలోని టర్కీ మద్దతుదారులు నివసించే ప్రాంతాల్లో వరుస బాంబు దాడులు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సిరియా-ఖుర్దీష్ నగరాలు, గ్రామాలకు సరిహద్దులను విస్తరించినప్పటి నుంచి టర్కీలో ఈ బాంబు దాడుల ఘటనలు జరుగుతున్నాయి.