దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎగిరి చెట్టును ఢీకొన్న యువతి
మొబైల్ చూస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి అనార్థలే జరుగుతాయనడానికి ముంబైలోని జగదాంబ సెంటర్లో జరిగిన షాకింగ్ ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

మొబైల్ చూస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి అనార్థలే జరుగుతాయనడానికి ముంబైలోని జగదాంబ సెంటర్లో జరిగిన షాకింగ్ ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
మృత్యువు ఎటువైపు నుంచి ఏ రూపంలో వస్తోందో ఎవరికి తెలియదు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు పరాధ్యాయనంగా వెళ్తే ఇలానే జరుతుందనడంలో సందేహం లేదు. మొబైల్ చూస్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి అనార్థలే జరుగుతాయనడానికి ముంబైలోని జగదాంబ సెంటర్లో జరిగిన షాకింగ్ ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అసలేం జరిగిందంటే.. ఓ కాలేజీ విద్యార్థిని ట్యూషన్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తోంది. మొబైల్ చూస్తు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో వెనుక నుంచి ఓ ప్యాసింజర్ కారు వేగంగా దూసుకొచ్చింది. కారు రూపంలో మృత్యువు వచ్చి యువతిని కబళించబోయింది.
కారును అదుపు చేయలేని డ్రైవర్ విద్యార్థినిని ఢీకొట్టాడు. అమాంతం గాల్లోకి ఎగిరిన విద్యార్థిని కారుతో పాటు చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కారు నుజ్జునుజ్జు అయింది. ప్రాణపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని, కారు డ్రైవర్ ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య యువతి కొట్టుమిట్టాడుతోంది. న్యూ ఇయర్ కు రెండు రోజుల ముందు జరిగిన ఈ ఘటనతో ఆమె ఇంట్లో ఆందోళన నెలకొంది. ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.