కూలిన నాలుగంతస్తుల భవనం : శిథిలాల కింద 8 మంది
హర్యానాలోని గురుగ్రామ్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది.

హర్యానాలోని గురుగ్రామ్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది.
హర్యానా : గురుగ్రామ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉల్లావాస్ గ్రామంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. భవన శిథిలాల క్రింద రెండు కుటుంబాలు చిక్కుకున్నాయి. శిథిలాల కింద 8 మంది చిక్కుకున్నారు. హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భవన శిథిలాలను రెస్క్యూ టీం తొలగిస్తున్నారు. తెల్లవారుజామున 5గంటలకు భవనం కూలిందని స్థానికులు చెబుతున్నారు.