తల్లీ, కూతుళ్లతో ఎస్సై రాసలీలలు : కేసు విచారణ పేరుతో ఛీటింగ్

  • Published By: chvmurthy ,Published On : February 18, 2020 / 10:26 AM IST
తల్లీ, కూతుళ్లతో ఎస్సై రాసలీలలు : కేసు విచారణ పేరుతో ఛీటింగ్

Updated On : February 18, 2020 / 10:26 AM IST

పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళలతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు చనువుగా ప్రవర్తిస్తున్నారు. అధికారులే అలా ప్రవర్తిస్తుంటే కానిస్టేబుల్ స్ధాయి ఉద్యోగులు కూడా అదే బాట పడతూ డిపార్ట్ మెంట్ స్ధాయిని దిగ జారుస్తున్నారు. 

తాజాగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఓ ఎస్‌ఐ జరిపిన రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో ఎస్‌ఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అతడు చెప్పే మాటలు నమ్మి….కేసు విచారణ కోసం ఆమె లక్షల రూపాయలు అతనికి సమర్పించింది. కేసు విచారణలో భాగంగా బాధిత మహిళ ఇంటికి వెళ్లే ఎస్సై  ఫిర్యాదుదారుతో పాటు క్రమేపీ ఆమె తల్లితో కూడా వివాహేతర సంబంధం పెట్టకున్నాడు. ఈ విషయం సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ దృష్టికి రావడంతో ఎస్‌ఐపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. 

కొన్నేళ్ల కిందట మాదాపూర్ జోన్ పరిధిలోని ఒక పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు ఒక వివాహిత వచ్చింది. ఆమె ఫిర్యాదు తీసుకున్న పోలీసులు  కేసు నమోదు చేశారు. మీకేం పర్వాలేదు… నేను సాయంచేస్తాను.. అంటూ స్టేషన్ ఎస్సై కొండంత అభయం ఇచ్చాడు. విచారణ పేరుతో ఎస్సై చేసిన హడావిడి చూసి అంతా నిజమని నమ్మి అతడికి విడతల వారీగా రూ.5 లక్షలు ఇచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. బాధితురాలు నమ్మింది. ఇదివరకటి కంటే ఎక్కువ సార్లు బాధితురాలి ఇంటికి వెళ్లటం మొదలెట్టాడు. 

కేసు దర్యాప్తులో భాగంగానే ఎస్సై తమ ఇంటికి వస్తున్నాడని ఇంట్లోని  మిగతా వారందరూ అనుకున్నారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లితోనూ ఎస్సై వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.  కొన్నాళ్లకు బాధితురాలికి ఎస్సై పై అనుమానం వచ్చి వారిద్దరినీ గమనించసాగింది.

ఒక రోజు గట్టిగా తల్లిని నిలదీయటంతో అసలు విషయం బయటపడింది. పెళ్లిచేసుకుంటానని చెప్పి ఎస్సై తనను మోసగించాడని బాధిత మహిళ..ఆ ఎస్సై పని చేస్తున్న పోలీసుస్టేషన్లోనే కేసు పెట్టింది. ఎస్సై మీద కేసు కావటంతో చాలా రోజుపాటపోలీసులు కేసు నమోదు చేసుకోలేదు.  కొన్నాళ్ల తర్వాత  పోలీసులు కేసు నమోదు చేసినా ఎస్సైగారు తన పలుకుబడితో కేసును అటకెక్కించారు. 

కొన్నాళ్లకు  ఆఎస్సై శంషాబాద్ జోన్లోని మరొక పోలీసు స్టేషన్ కు  బదిలీ అయ్యాడు. ఈలోగా రాష్ట్రంలో దిశ కేసు జరిగింది. పోలీసులు మహిళల రక్షణ, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో బాధిత మహిళ చొరవ చూపి తనకు జరిగిన అన్యాయాన్ని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారుల శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఎస్సై తీరుపై ఉన్నతాధికారులు అగ్రహంతో ఉండటంతో నిందితుడు విధులకు గైర్హాజరు  అవుతున్నాడు. 

Read More>>మేము చనిపోతున్నాం..మా కోసం వెతకొద్దు’..ముగ్గురు అమ్మాయిలు మెసేజ్ కలకలం