Fake Certificate Gang : నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసే ముఠా అరెస్ట్
నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డ్ లు తయారు చేసే ముఠాను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు

Hyd Cp Anjani Kumar
Fake Certificate Gang : నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్ కార్డ్ లు తయారు చేసే ముఠాను హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు తయారు చేస్తున్నారని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ చెప్పారు.
ముఠాకు చెందిన 8 మంది సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్దనుంచి 6ఆధార్ కిట్స్, స్టాంప్స్, ఆధార్ కార్డ్ ఫాంమ్స్, ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డ్ , 80వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Call Data : యూజర్ల కాల్ డేటాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు… రెండేళ్లు పాటు భద్రపరచాలిZ
ముఠాలోని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఫోర్జరీ గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలతో ముఠా భారీ మోసాలకు పాల్పడుతోంది. జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లోంచిడౌన్లోడ్ చేసి సర్టిఫికెట్స్ ను ఫోర్జరీ చేస్తోందని పోలీసు కమీషనర్ చెప్పారు.
ఈ ముఠా ఇంతవరకు 3 వేల ఆధార్ కార్డ్స్ జారీ చేసిందని… వీటిలో 100 ఫేక్ కార్డ్స్ గుర్తించామని ఆయన తెలిపారు. ఒక్కో కార్డుకు వెయ్యినుంచి రెండు వేల రాపాయల వరకు ఈముఠా డబ్బులువసూలు చేసిందని అంజనీ కుమార్ వివరించారు.