ముంబైలో అగ్నిప్రమాదం

ముంబై పాట్లిపడ గుడ్ బండార్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లోని ఓ పోర్షన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. అపార్ట్ మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో అపార్ట్ మెంట్ లో నుంచి భయటికి పరుగులు తీశారు. అయితే ఉదయం అందరూ మేల్కొన్నాక ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.