షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం.. తగలబడిన కారు

హైదరాబాద్ షేక్ పేట్ లోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పెట్రోల్

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 09:07 AM IST
షేక్ పేట్ పెట్రోల్ బంక్ లో అగ్నిప్రమాదం.. తగలబడిన కారు

Updated On : December 31, 2019 / 9:07 AM IST

హైదరాబాద్ షేక్ పేట్ లోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పెట్రోల్

హైదరాబాద్ షేక్ పేట్ లోని పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్ నింపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్నాయి. పెట్రోల్ బంకులోనే కారు మంటల్లో తగలబడుతోంది. కారు పూర్తిగా దగ్ధమైంది. సిబ్బంది, వాహనదారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఎగిసిపడుతుండటంతో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళకు గురయ్యారు. 

fire

మంటలు చెలరేగడంతో పెట్రోల్ బంకులో దట్టమైన పొగ ఆవరించింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేసింది. దీంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

fire2

గోల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:
గోల్కోండ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ లో పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం జరిగింది. కారులో పెట్రోల్ ఫిల్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి. కారు కాలి బూడదైంది. బంకులో దట్టమైన పొగ ఆవరించింది. పెట్రోల్ బంకు సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో 20 నిమిషాల పాటు శ్రమించి మంటలను ఆర్పివేసింది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫోన్ లో మాట్లాడటం వల్ల ఇలా జరిగిందా? కారు హీట్ ఎక్కడం వల్ల ఇలా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read : మీకు గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే వెంటనే..