Delhi: కోచింగ్ సెంటర్‭లో అగ్ని ప్రమాదం.. కిటికీల నుంచి బయటికి దూకిన విద్యార్థులు

నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కోచింగ్ సెంటర్‭లో మంటలు చెలరేగడంతో విద్యార్థులు కిటికీ గుండా ఏర్పాటు చేసిన తాడు ద్వారా కిందకు దూకడం చూడవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు

Delhi: కోచింగ్ సెంటర్‭లో అగ్ని ప్రమాదం.. కిటికీల నుంచి బయటికి దూకిన విద్యార్థులు

Fire Broke: ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్‭లో గురువారం అగ్నిప్రమాదం సంభవించడంతో విద్యార్థులు కిటికీల నుంచి కిందకు దూకి తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు. 11 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, మధ్యాహ్నం 12.30 గంటలకు కోచింగ్ సెంటర్‭లో మంటలు చెలరేగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అందులోని విద్యార్థులను కిటికీల ద్వారా అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

Rajasthan Govt : రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సస్పెండ్

నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కోచింగ్ సెంటర్‭లో మంటలు చెలరేగడంతో విద్యార్థులు కిటికీ గుండా ఏర్పాటు చేసిన తాడు ద్వారా కిందకు దూకడం చూడవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదం గురించి తమకు మధ్యాహ్నం 12.27 గంటలకు కాల్ వచ్చిందని, మొత్తం 11 ఫైర్ టెండర్లను సహాయక చర్యల్లో అందుబాటులో ఉంచామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.


కాగా ఎలక్ట్రిక్ మీటర్ కారణంగా మంటలు చెలరేగాయని అతుల్ అన్నారు. ప్రస్తుతం మంటలు ఆర్పేశామని, ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారని అన్నారు.