Firing in Abids : ఆబిడ్స్ ఎస్‌బీఐ లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ఓ సెక్యూరిటీ గార్డ్‌ తోటి సిబ్బందిపైనే కాల్పులకు తెగబడ్డాడు.

Firing in Abids : ఆబిడ్స్ ఎస్‌బీఐ లో కాల్పుల కలకలం

Sbi Fb

Updated On : July 14, 2021 / 4:40 PM IST

Firing in Abids  : హైదరాబాద్‌ ఆబిడ్స్ లో బుధవారం కాల్పుల కలకలం చెలరేగింది. స్ధానిక ఎస్బీఐ బ్యాంక్ లో సర్దార్ అనే సెక్యూరిటీ గార్డ్‌,  ఈ రోజు మధ్యాహ్నం    తోటి సిబ్బంది పైనే కాల్పులకు తెగబడ్డాడు. సురేందర్ అనే వ్యక్తి పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లోసురేందర్  తీవ్రంగా గాయపడ్డాడు. సురేందర్ కు ఎడమ వైపు కడుపులో తీవ్ర గాయం  అయ్యింది. గాయపడిన సురేందర్ ను తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న అబిడ్స్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.  కాల్పులు జరిపిన సర్దార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు.

ఘటనా స్ధలంలో బోర్ గన్ కు చెందిన రెండు బుల్లెట్లు పడి ఉన్నాయి.  తోటి ఉద్యోగులతో సర్దార్ దురుసుగా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.  కాల్పులు శబ్దం వినపడగానే బ్యాంకులో ఉన్న కస్టమర్లు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.  సర్దార్ కాల్పులు  జరపటానికి గల కారణాలు తెలియ రాలేదు. సర్ధార్ ను అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.