Aurora shooting : అమెరికాలో కాల్పులు

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 01:19 AM IST
Aurora shooting : అమెరికాలో కాల్పులు

Updated On : February 16, 2019 / 1:19 AM IST

అగ్రరాజ్యంలో గన్ కల్చర్ పెరిగిపోతోందని అనడానికి మరో ఉదహారణ. కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇల్లినాయిస్‌లోని ఇండస్ట్రీయల్ పార్కులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఫైరింగ్‌లో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతేగాకుండా పలువురికి గాయాలయ్యాయి. 

పశ్చిమ షికాగోకు 65 కి.మీట్లర దూరంలో అరోరా ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న పరిశ్రమలో పైపులకు సంబంధించిన వాల్వులు తయారవుతుంటాయి. కంపెనీలో పనిచేసే గ్యారీ మార్టిన్ అనే వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. అసలు ఎందుకు కాల్పులు జరిపాడు ? అనే సంగతి మాత్రం తెలిసిరాలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కాల్చి చంపేశారు. తీవ్రగాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి కంట్రోల్‌లో ఉందని పోలీసులు పేర్కొన్నారు.