అతివేగం ప్రాణం తీసింది : రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 05:18 AM IST
అతివేగం ప్రాణం తీసింది : రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

Updated On : November 3, 2019 / 5:18 AM IST

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న కారు.. గరికపాడు చెక్ పోస్టు దగ్గర ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలం భీతావహంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు గోపయ్య, బసవరెడ్డిలుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన వారి కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి బయలుదేరారు.