Tamil Nadu: విహారయాత్రకు వెళ్లిన మైనర్ బాలికపై నలుగురు పోలీసు అధికారుల పైశాచికం
నిందితులు.. సబ్‌ఇన్‌స్పెక్టర్ బి శశికుమార్ (28), కానిస్టేబుళ్లు శంకర్ రాజ్‌పాండియన్ (32), ఎ సిద్ధార్థన్ (30), జె ప్రసాద్ (26)లపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Tamil Nadu: పోలీసులు అంటే మన భద్రతకు బాధ్యత వహిస్తారు. కానీ పోలీసులు చాలా సందర్భాల్లో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. నిజానికి పోలీసులంటే ప్రజలు భయంతో వణికిపోతారు. ఉద్యోగపరంగా కాస్త దురుసుగా ఉండడం ఒకటైతే.. కొన్నిసార్లు వారే తీవ్ర నేరాలకు పాల్పడుతుంటారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలికపై నలుగురు పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అది కూడా తన ప్రియుడితో కలిసి బయటికి వచ్చిన బాలికను బెదిరించి, అతడిని కొట్టి ఈ దాడికి పాల్పడడం మరింత దుర్మార్గం.
కాగా ఆ నలుగురు పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. గత ఏడాది కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న జంట (అబ్బాయి, అమ్మాయి) ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా, వారిని సాధారణ దుస్తులలో ఉన్న నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. వారు తమను తాము పోలీసు అధికారులుగా చెప్పుకున్నట్లు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు. అనంతరం, ఇద్దరిని ప్రశ్నించగా సంబంధం గురించి తమ కుటుంబ సభ్యులకు తెలుసని బాలుడు చెప్పడంతో, ఒక పోలీసు అధికారి అతని చెంపదెబ్బ కొట్టాడు. అనంతరం అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Caste Census: గెలిస్తే కులగణన చేస్తామని రాహుల్, ప్రియాంక హామీలిస్తున్నారు.. మరి ఇప్పుడెందుకు చేయరు?
బాధిత బాలిక తిరుచిరాపల్లి జిల్లాలో తన ప్రియుడితో కలిసి పర్యాటక యాత్రకు వెళ్లింది బాలిక. ఈ ఘటన బుధవారం జరిగిందని, ఒకరోజు తర్వాత నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు.. సబ్‌ఇన్‌స్పెక్టర్ బి శశికుమార్ (28), కానిస్టేబుళ్లు శంకర్ రాజ్‌పాండియన్ (32), ఎ సిద్ధార్థన్ (30), జె ప్రసాద్ (26)లపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.