Girl Kidnap Case: 15 ఏళ్ల బాలికను కిడ్నాపర్ల నుంచి కొనుగోలు చేసి పలుసార్లు అత్యాచారం చేసిన మృగాడు

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను హరియాణాలోని ఓ వ్యక్తి(35)కి అమ్మేశారు. ఆ బాలికను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు.

Girl Kidnap Case: 15 ఏళ్ల బాలికను కిడ్నాపర్ల నుంచి కొనుగోలు చేసి పలుసార్లు అత్యాచారం చేసిన మృగాడు

Girl Kidnap Case

Updated On : December 22, 2022 / 6:10 PM IST

Girl Kidnap Case: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఆమెను హరియాణాలోని ఓ వ్యక్తి(35)కి అమ్మేశారు. ఆ బాలికను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఈ ఏడాది అక్టోబరు 11న దసరా వేడుకల సమయంలో ఓ బాలికను కొందరు అపహరించారు. దీంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. విచారణలో భాగంగా కొందరు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. ఆ క్రమంలో ఆ బాలిక ఎక్కడ ఉందన్న వివరాలు రాబట్టారు.

ఆ బాలికను కిడ్నాపర్లు హరియాణాలోని సోనిపత్ కు తరలించారని పోలీసులు తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి పోలీసులు వెళ్లి, ఓ ఇంట్లో నుంచి ఆ బాలికను రక్షించారు. ఆమెను తిరిగి ఛత్తీస్‌గఢ్‌కు తీసుకువచ్చారు. ఆ బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి ఆమెపై పలుసార్లు అత్యాచారం చేశాడని తేల్చారు.

ఆ బాలికను కొనుగోలు చేసి, ఆమెపై అత్యాచారం చేసిన సోనిపత్ లోని 35 ఏళ్ల నిందితుడితో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశామని పోలీసులు వివరించారు. కొరియా జిల్లాకు చెందిన ఆ ముగ్గురు బాలికను కిడ్నాప్ చేయడంతో పాటు హరియాణా వ్యక్తిని బాలికను అమ్మేయడంలో నిందితులని చెప్పారు.

Pencil Girl Dies : తల్లిదండ్రులూ, బీకేర్ ఫుల్.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి మృతి