Gold Mining Blast : బంగారం గని సమీపంలో పేలుళ్లు 59 మంది మృతి 100 మందికి గాయాలు

పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో లో పేలుడు సంభవించింది. బంగారం గని సమీపంలో పేలుళ్లు సంభవించి దాదాపు 59 మంది మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు.

Gold Mining Blast : బంగారం గని సమీపంలో పేలుళ్లు 59 మంది మృతి 100 మందికి గాయాలు

Gold Mining Blast

Updated On : February 22, 2022 / 11:34 AM IST

Gold Mining Blast :  పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో లో పేలుడు సంభవించింది. బంగారం గని సమీపంలో పేలుళ్లు సంభవించి దాదాపు 59 మంది మరణించారు. మరో వంద మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉందని స్ధానిక వార్తా సంస్ధలు వెల్లడించాయి. గని సమీపంలో ఉన్న బంగారం శుధ్ది చేసే కర్మాగారంలో రసాయనాల వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

ఆఫ్రికాలో బంగారాన్ని అత్యధికంగా ఉత్తత్తి చేసే దేశాల్లో బుర్సినాఫాసో ఒకటి. ప్రపంచంలో ఐదో అతి పెద్ద దేశంగా ఉంది. దేశంలోని బంగారు గనుల్లో దాదాపు 10.5లక్షల మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు, కాగా గామ్ బ్లోరాలో దాదాపు 8 వందల ఎకరాల్లో చిన్న చిన్నబంగారు గనులు ఉన్నాయి.

Also Read : Ukraine Crisis: యుక్రెయిన్ నుంచి భారత్ కు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం

ఇక్కడి నుంచి టోగో, బెనైన్ నైగర్ ఘనా దేశాలకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుంటారు. గామ్ బ్లోరాలోని బంగారం గని పక్కనే ఉన్న బంగారం శుధ్ది చేసే కర్మగారంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మొదట పేలుడు సంభవించింది. కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు పెట్టారు.

ఆ ప్రాంతంమంతా మృతదేహాలతో  భీతావహంగా ఉందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 2016 నుండి దేశంలో దాడులకు పాల్పడుతున్న ఆల్ ఖైదా మరియు ఇస్లామిక్ స్టేట్ తో సంబంంధం ఉన్న జిహాదీలు కూడా చిన్న చిన్న తరహా గనులను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.