Gold Robbery : బంగారం షాపులో భారీ చోరీ

విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంటస్థంభం సమీపంలోని రవి జ్యూయలర్స్ లో దుండగులు భారీ చోరికి  తెగబడ్డారు.

Gold Robbery : బంగారం షాపులో భారీ చోరీ

Vizianagaram Gold shop Robbery

Updated On : February 23, 2022 / 4:11 PM IST

Gold Robbery  : విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంటస్థంభం సమీపంలోని రవి జ్యూయలర్స్ లో దుండగులు భారీ చోరికి  తెగబడ్డారు. షాపు తాళాలు పగలగొట్టి దోపిడీ చేసిన దుండగులు ఐదు కిలోల బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇది చత్తీస్‌ఘడ్‌కు  చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠా పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న మంగళవారం మార్కెట్‌కు సెలవు కావటంతో షాపు తెరవలేదు. సోమవారం రాత్రే ఈ దొంగతనం జరిగినట్లు  పోలీసులు భావిస్తున్నారు. షాపు యజమాని ఇచ్చిన  ఫిర్యాదుతో రంగంలోకి దిగిన  క్లూస్ టీం, పోలీసులు  ఆధారాల కోసం గాలిస్తున్నారు.

Also Read : Extra Marital Affair : భార్య ప్రవర్తనపై అనుమానం…అత్త,భార్యను నరికి చంపిన వ్యక్తి