TDP Leader Murder Case : గుంటూరు జిల్లా టీడీపీ నేత హత్య కేసులో 8 మంది అరెస్ట్
గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో నిన్న ఉదయం జరిగిన టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Guntur Rural SP Vishal Gunni
TDP Leader Murder Case : గుంటూరు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో నిన్న ఉదయం జరిగిన టీడీపీ నేత తోట చంద్రయ్య హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపధ్యంలోనే హత్య జరిగినట్లు..నిందితులు, హతుడు అందరూ బంధువులేనని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
తోట చంద్రయ్యకు, ప్రధాన ముద్దాయి చింతా శివరామయ్యకు 3 ఏళ్ల క్రితం సిమెంట్ రోడ్డు విషయంలో గొడవ జరిగింది. అప్పటినుండి వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈక్రమంలో జనవరి 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల కుమార్తె ఓణీల కార్యక్రమానికి హాజరైన తోట చంద్రయ్య అక్కడకు వచ్చిన బంధువులతో చింతా శివరామయ్యను చంపుతానని అన్నాడు.
Also Read : Monkey Attack : కోతి దాడి నుంచి తప్పించుకోబోయి బిల్డింగ్ పైనుంచి పడి మహిళ మృతి
ఆవిషయం తెలుసుకున్న శివరామయ్య తనని చంపటానికంటే ముందే చంద్రయ్యను చంపాలని తన కుమారుడితోసహా మరో ఆరుగురితో కలిసి చంద్రయ్య హత్యకు ప్లాన్ చేశాడు. ఈక్రమంలో నిన్న ఉదయం 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యను చింతా శివరామయ్య మరోక 7 గురు వ్యక్తుల కత్తులతో దాడి హత్య చేసి పరారయ్యారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్ధలానికి చేరుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించి 24 గంటల్లోగా నిందితులందరినీ అరెస్ట్ చేసారు.