విడాకులివ్వకపోతే, నీ బాత్రూం వీడియోలు సోషల్ మీడియాలో పెడతా…. భర్త బెదిరింపులు

విడాకులివ్వకపోతే, నీ బాత్రూం వీడియోలు సోషల్ మీడియాలో పెడతా…. భర్త బెదిరింపులు

Updated On : December 30, 2020 / 9:13 PM IST

Husband : అగ్ని సాక్షిగా తాళికట్టిన భర్త, ఆడపిల్ల పుట్టిందని… అదనపు కట్నం కోసం వేదించటం మొదలెట్టాడు. దీంతో భార్య కోర్టులో కేసు వేసింది. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా విడాకులు ఇవ్వాలని లేకపోతే భార్య నగ్నచిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించసాగాడు.

ప్రకాశం జిల్లాకు చెందిన యువతికి గుంటూరు జిల్లాకు చెందిన యువకుడితో 2016లో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో వరుడికి కట్నం కింద లక్ష రూపాయలు నగదు, 5 సవర్ల బంగారం, ఇంటి సామాన్లు, రూ.10 లక్షలు ఖరీదు చేసే ఇంటి స్థలం రాసిచ్చారు. వారికి పాప పుట్టినప్పటినుంచి అత్తింటివారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అదనపు కట్నం తేవాలని, భర్త, అత్త, మామ, ఆడపడుచులు మహిళను వేధింపులకు గురి చేయసాగారు.

దీంతో ఆ మహిళ 2018లో స్ధానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి కోర్టుకు సమర్పించారు. కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా 2019లో ఆమె భరణం కేసు వేసింది. ప్రస్తుతం అది పెండింగ్ లో ఉంది.

ఈలోగా ఆమె భర్త, మహిళ సమీప బంధువులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని తెలిపింది. తన ఫోన్ ట్యాప్ చేసి రికార్డు చేసినట్లు…వాటిలో కొన్నిటిని వాట్సప్ సందేశాలు పంపుతున్నట్లు ఆమె గుంటూరు ఎస్పీ గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. తాను విడాకులు ఇవ్వకపోతే గతంలో రహస్యంగా చిత్రీకరించిన బాత్రూం దృశ్యాలను ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్నాడని ఆ మహిళ వాపోయింది.

తన భర్తకు రెండు సెల్ ఫోన్ కంపెనీల ప్రతినిధులు తెలుసని వారి ద్వారా తన ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఆమె పేర్కోంది. భర్త, ఆడపడుచు, అతనికి సహకరించిన సెల్ ఫోన్ కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె పోలీసులను వేడుకుంది.