Family Disputes : కుటుంబ కలహాలు.. మొదటి భార్య హత్య

Wife Killed By Husband
Family Disputes : కుటంబంలో కలహాల కారణంగా ఒక వ్యక్తి తన మొదటి భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని రెంజల్ మండలం నీలా గ్రామంలో దావూజీ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు. కుటుంబంలో గొడవలు కారణంగా ప్రస్తుతం అతను రెండో భార్య దగ్గర ఉంటున్నాడు. రెండో భార్య ప్రోద్బలంతో మొదటి భార్య మునుబాయి(45)ని సోమవారం రాత్రి కత్తితో పొడిచి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు.