Dog Bite : భార్యను కరిచిందని కుక్కను చంపిన భర్త
పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్క భార్యను కరిచిందని...తన దగ్గర ఉన్న రైఫిల్ తో కుక్కని కాల్చి చంపేశాడు ఓ భర్త.

Husband Shoots Dead Neighbours Pet Dog For Biting Wife Indore
Dog Bite : పొరుగింట్లో ఉండే పెంపుడు కుక్క భార్యను కరిచిందని…తన దగ్గర ఉన్న రైఫిల్ తో కుక్కని కాల్చి చంపేశాడు ఓ భర్త. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో బుధవారం ఈఘటన చోటు చేసుకుంది. సుదామా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివసించే నరేంద్ర విశ్వయ్య (53) అనే వ్యక్తి భార్యను పొరుగింటిలో ఉండే పెంపుడు కుక్క కరిచింది. దీంతో కోపం పట్టలేని నరేంద్ర తన దగ్గర ఉన్న లైసెన్సెడ్ రైఫిల్ తో కుక్కను కాల్చాడు. కుక్క మెడకు బుల్లెట్ గాయమై అక్కడికక్కడే చనిపోయింది.
కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పెంపుడు జంతు సంరక్షణ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాధమిక విచారణలో… కుక్క ఇది వరకే స్ధానికంగా చాల మందిని కరిచిందని నరేంద్ర పోలీసులకు చెప్పాడు. ఒకవేళ నిందితుడి వాదనలు నిజమని తేలితే పెంపుడు జంతువు యజమానిపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.