Doctor Arrested : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన డాక్టర్ అరెస్ట్

డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతిని పెళ్లి పేరుతో మోసం చేయబోయిన డాక్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Doctor Arrested : పెళ్లి పేరుతో యువతిని మోసం చేసిన డాక్టర్ అరెస్ట్

Hyderabad Doctor Arrested

Updated On : July 14, 2021 / 9:16 PM IST

Doctor Arrested : డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతిని పెళ్లి పేరుతో మోసం చేయబోయిన డాక్టర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు పెళ్లైనా, పెళ్ళి కాలేదని చెప్పి ఆ యువతితో ప్రేమాయణం నడిపి వివాహం చేసుకోటావికి యత్నించాడు. గచ్చిబౌలి లోని ఏఐజి ఆసుపత్రిలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న గబ్బిట అభిరాం చంద్ర అనే డాక్టర్‌కు బంబుల్ డేటింగ్ యాప్ ద్వారా ఒక యువతి పరిచయం అయ్యింది.

అనంతరం ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆపరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆమెకు ఇష్టమైతే పెళ్లిచేసుకుందామని ప్రపోజల్ చేశాడు. అందుకు ఆమె సిధ్ధపడింది. కానీ ఇంతలో ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. అప్పటికే అభిరాం చంద్రకు వివాహం అయిందని తెలుసుకున్న యువతి డాక్టర్ పై కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అభిరాం చంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.