Extra Marital Affair : వివాహేతర సంబంధం తెలిసిపోయిందని యువకుడు ఆత్మహత్య
పెళ్ళి అయి పిల్లవాడు ఉన్న వ్యక్తి మరోక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ సంగతి భార్యకు తెలిసి పోవటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో

Hanging Ghatkesar
Extra Marital Affair : పెళ్ళి అయి పిల్లవాడు ఉన్న వ్యక్తి మరోక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ సంగతి భార్యకు తెలిసి పోవటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం స్ధానిక బాలాజీ నగర్ లో నివసించే సాయికుమార్(35 ) అనే వ్యక్తి 12 ఏళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒకబాబు ఉన్నాడు. ఈ క్రమంలో సాయికుమార్ కు నవనీత అనే మరోక మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కొన్నాళ్లకు ఆ విషయం అతని భార్యకు తెలిసి ఆమె భర్తను మందలించింది. భర్త తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. దీంతో తన వివాహేతర సంబంధం విషయం ఇంట్లో తెలిసి పోయిందని… మార్చి 30న భార్య ఉద్యోగానికి వెళ్ళిన సమయంలో…కొడుకును అత్తగారింటికి పంపించిన సాయికుమార్ ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read : Madhya Pradesh : మైనర్ బాలికపై అత్యాచారం-మహంతు, అనుచరుడి ఇళ్లు నేల మట్టం
సమాచారాం తెలుసుకుని ఇంటికి వచ్చిన భార్య భర్తను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.