Hyderabad: యువకుడిని గాఢంగా ప్రేమించి.. విడిపోయాక పగ పట్టి.. కన్నింగ్ ప్లాన్ వేసిన అమ్మాయి..

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విద్యార్థిని నుంచి పోలీసులు...

Hyderabad: యువకుడిని గాఢంగా ప్రేమించి.. విడిపోయాక పగ పట్టి.. కన్నింగ్ ప్లాన్ వేసిన అమ్మాయి..

Ex girl Friend conspiracy

Updated On : December 26, 2023 / 6:39 PM IST

ఓ యువకుడిని గాఢంగా ప్రేమించింది ఓ కాలేజీ అమ్మాయి. బ్రేకప్ అయ్యాక అతడిపై పగ పట్టింది. మరో అబ్బాయితో ప్రేమలో పడింది. మాజీ ప్రియుడికి చిప్పకూడు తినిపించాలనుకుని భారీ ప్రణాళికే వేసుకుంది. మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టించి పోలీసులకు పట్టించింది.

ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు అమాయకంగా ముఖం పెట్టుకుని తిరిగింది. గంజాయి కేసులో యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసును ఛేదించి ఆ యువకుడి తప్పేమీ లేదని తేల్చారు. అతడి కారులో గంజాయి పెట్టిన లా విద్యార్థినితో సహా ఏడుగురిని అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల నుంచి పోలీసులు 40 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మీడియాకు వివరాలు తెలిపారు. రింకూ అనే అమ్మాయి రహమత్ నగర్ లా కాలేజ్ స్టూడెంట్. ఆమె మాజీ ప్రియుడి పేరు శ్రవణ్ కుమార్.

అతడితో కొన్నాళ్లు ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. అన్ని రోజులు శ్రవణ్ కుమార్ లేనిదే బతకలేననేలా ప్రవర్తించిన యువతి.. అతడితో విభేదాలు తర్వాత ఎలాగైనా అష్టకష్టాలు పెట్టాలని కన్నింగ్ ప్లాన్ వేసింది. ‘మాట్లాడుకుందాం ఒకసారి వస్తావా ప్లీజ్’ అంటూ శ్రవణ్‌ని ఓ చోటుకి పిలిపించింది.

తనకు ఉన్న కన్నింగ్ ఫ్రెండ్స్‌తో కలిసి శ్రవణ్ కారులో గంజాయి పెట్టింది. ఆ తర్వాత అతడిని పోలీసులకు పట్టించింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు శ్రవణ్ అమాయకుడని తేల్చారు. రెహమత్ నగర్‌కు చెందిన అబోక్ షజా అలియాస్ రింకీని ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. ఆమె స్నేహితులు దీపక్ మోహన్, యశ్వంత్ సాయి, దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపీ, సూర్య తేజ, మహేందర్ యాదవ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Viral Video: లంచం ఎందుకు తీసుకోవాలో వివరించి చెప్పిన తహసీల్దారు.. మీరూ వింటారా?