నా కూతుర్ని కాపాడండి : దుబాయ్ ఏజెంట్ల మోసానికి గురైన యువతి తల్లి ఆవేదన

  • Published By: chvmurthy ,Published On : February 4, 2020 / 03:54 AM IST
నా కూతుర్ని కాపాడండి : దుబాయ్ ఏజెంట్ల మోసానికి గురైన యువతి తల్లి ఆవేదన

Updated On : February 4, 2020 / 3:54 AM IST

బ్యూటీషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని తన కూతుర్ని విదేశాలకు తీసుకెళ్లి పనిమనిషి ఉద్యోగం ఇప్పించి హింసిస్తున్న ఇద్దరు ఏజెంట్లపై ఒక హైదరాబాద్ మహిళ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ (మానవ అక్రమ రవాణా)లో చిక్కుకుందని దయచేసి భారత్‌కు తిరిగి రప్పించాల్సిందిగా ఓ తల్లి వేడుకుంటోంది.

హైదరాబాద్‌ నివాసి సయీద్‌ సుల్తానా తన బాధను  చెపుతూ….. తన కూతురు అమ్రీన్‌ సుల్తానా ఉద్యోగం నిమిత్తం 2017లో సౌదీ అరేబియాకు వెళ్లింది.  ఏజెంట్ల మోసానికి గురై సౌదీ అరేబియాలో తీవ్ర చిత్రహింసలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 

ఇద్దరు ఏజెంట్లు సౌదీ అరేబియాలోని దమ్మమ్‌లో బ్యూటీషియన్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రియాద్‌లో పనిమనిషిగా నియమించినట్లు  తెలిపింది. ఆమెకు జీతం ఇవ్వకపోవడమే కాక కనీసం తినేందుకు ఆహారం, తాగేందుకు నీళ్లు సైతం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు  సుల్తానా చెప్పారు. ఏజెంట్లు ఆమె వయస్సును 16 నుంచి 28కి పెంచి అక్రమ పద్దతిలో సౌదీకి పంపించారన్నారు. భారత రాయభార కార్యాలయాన్ని, అదే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని తన కూతురిని భారత్‌కు తిరిగి రప్పించాల్సిందిగా ఆమె వేడుకున్నారు.