Pardhi Gang Arrest : జూబ్లీహిల్స్‌లో నలుగురు పార్థి గ్యాంగ్ అరెస్ట్ .. పరారీలో మరో 19 మంది..!
Pardhi Gang Arrest : చందనం దుంగల దొంగతనాలకు పాల్పడిన మధ్యప్రదేశ్‌కు పార్ధి కమ్యూనిటీకి చెందిన నలుగురు మహిళలను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Pardhi community (Image Credit : Facebook
Pardhi Gang Arrest : హైదరాబాద్ నగరంలో పార్థి గ్యాంగ్ తిష్ట వేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పార్థి గ్యాంగ్ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని చందనం దుంగలపై కన్నేసింది. చాలావరకు దుంగలను ఈ గ్యాంగ్ చోరీ చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన జూబ్లీహిల్స్ పోలీసులు చందనం దుంగలను చోరి చేసిన పార్టీ గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో 19 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
మొత్తం 23 మంది పార్ధీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు గుర్తించారు. యూసఫ్‌గూడ ఎన్ఐ (MESME)లో చందనం చెట్లను చోరి చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు మహిళలు, పిల్లలతో మొత్తం 23 మంది నగరంలో సంచరిస్తూ చందనం చెట్లను చోరికి పాల్పడుతున్నారు.
Read Also : Samsung Galaxy S24 Ultra : బిగ్ డిస్కౌంట్.. రూ. లక్ష ఖరీదైన శాంసంగ్ అల్ట్రా ఫోన్ జస్ట్ ఎంతంటే?
మధ్యప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 20 పార్ధీ కమ్యూనిటీకి చెందిన కుటుంబాలుగా పోలీసులు గుర్తించారు. రాత్రి సమయాల్లో చందనం దుంగలను నరికి తీసుకువెళ్తున్నట్లు విచారణలో తేలింది. ఈ పార్థి ముఠా నుంచి 10 చందనం దుంగలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.