బీ కేర్ ఫుల్ : కరోనా సోకిన యువతి ఫోటో వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్న యువకుడి అరెస్ట్ 

కరోనా వైరస్ సోకిన యువతి ఫోటోను  తన వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్న  యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.  కరోనా రోగుల పట్ల గోప్యత  పాటించాలని వారి వివరాలు ఫోటోలు ప్రచురించవద్దని, ప్రచ

బీ కేర్ ఫుల్ : కరోనా సోకిన యువతి ఫోటో వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్న యువకుడి అరెస్ట్ 

Updated On : January 21, 2022 / 1:42 PM IST

కరోనా వైరస్ సోకిన యువతి ఫోటోను  తన వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్న  యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.  కరోనా రోగుల పట్ల గోప్యత  పాటించాలని వారి వివరాలు ఫోటోలు ప్రచురించవద్దని, ప్రచారం చేయవద్దని,  ప్రభుత్వం ఎంత చెపుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు.

కర్ణాటక లోని విజయపుర  జిల్లాకు కు చెందిన  అనిల్ రాథోడ్ అనే 24 ఏళ్ల యువకుడు తన వాట్సప్ స్టేటస్ గా ఒక యువతి ఫోటో పెట్టుకున్నాడు.దాని కింద  .. బ్యాడ్ న్యూస్…. ఈ యువతికి కరోనా పాజిటివ్ వచ్చిందని… క్యాప్షన్ కూడా రాశాడు. ఈ వాట్సప్ స్టేటస్ చూసిన కొందరికి ఆ యువతి తెలుసు. వారు ఈ విషయం ఆయువతికి చేరవేశారు.

మరి కొందరు ఆ అమ్మాయి ఎక్కడు ఉంటుంది. ఆమెకేమైనా సహాయం  కావాలా అని అడిగారు. మరి కొందరేమో ఇలా ఫోటో పెట్టి ఆ అమ్మాయి పరువు తీస్తావా అని  అతడిని తిట్టి పోశారు.  ఈ సంగతి  మొత్తానికి ఆ అమ్మాయి ఉండే ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈవిషయం పోలీసులకు తెలిసి అనిల్ రాథోడ్ ను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కేంద్ర  ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కరోనా రోగుల వివిరాలను బయట పెట్టకూడదు.  ఆ నిబంధనలు అతిక్రమించడం ద్వారా యువకుడు చిక్కుల్లో  పడ్డాడు.  యువతి ఫోటోను వాట్సప్ స్టేటస్ గా పెట్టడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు కలిగించాడని…..ఆమె పరువు తీసేందుకే.. ఉద్దేశ్య పూర్వకంగానేవాట్సప్ స్టేటస్ పెట్టాడని  పోలీసులు చెప్పారు.