కేరళలో 123 కేజీల బంగారం సీజ్

కేరళలో కస్టమ్స్ అధికారులు 23 ప్రాంతాల్లో చేసిన దాడుల్లో రూ.50కోట్ల విలువగల 123 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత బంగారం ఎక్కడ, ఎలా దొరికిందన్న డౌట్ మనకు రావచ్చు. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అలర్టయ్యారు. అది నిజమే అని తెలియడంతో కస్టమ్స్ అధికారులు ఒకేసారి జిల్లాలోని 23 ప్రాంతాల్లో దాడులు చేసి ఎక్కడికక్కడ బంగారాన్ని సీజ్ చేశారు.
వివరాలు.. తమిళనాడు నుంచి రహదారి మార్గంలో త్రిచూర్ కు ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మొత్తం 17 మంది స్మగ్లర్లు బంగారాన్ని తరలిస్తుండగా అధికారులకు దొరికిపోయారు.
అయితే ఈ దాడుల్లో బంగారం మాత్రమే కాదు.. రూ.2 కోట్ల క్యాష్, రూ.6.40 లక్షల విలువైన డాలర్ల నోట్లను సీజ్ చేశారు. ఇంతకీ వీళ్లు త్రిచూర్ కే బంగారాన్ని ఎందుకు తరలించాలనుకున్నారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.