హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు
7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని శివ బాలకృష్ణను విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా శివ బాలకృష్ణ..

HMDA Former Director Shiva Balakrishna
Shiva Balakrishna Disproportionate Assets Case : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు. శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్ట్ అయ్యారు. మూడు రోజుల పాటు నవీన్ ను విచారించిన ఏసీబీ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. శివ బాలకృష్ణకు నవీన్ బినామీగా ఉన్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణకు బినామీగా ఉండి ఆస్తులు కూడబెట్టినట్లుగా నిర్ధారించారు.
ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివ బాలకృష్ణ ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏసీబీ అధికారులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. శివ బాలకృష్ణ అక్రమాస్తులు పెద్ద ఎత్తున బటయపడుతున్నాయి. ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని శివ బాలకృష్ణను విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు.. తాజాగా శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణ ఆస్తులు, బినామీ ఆస్తులపై ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. బుధవారంతో కస్టడీ పూర్తవుతుంది. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.
Also Read : లక్కీ డ్రా పేరుతో ఘరానా మోసం.. 5కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన వైనం
శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్.. బాలకృష్ణకు బినామీగా ఉన్నాడు. కీలక ఆస్తులన్నీ నవీన్ కుమార్ కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవీన్ ను అరెస్ట్ చేసిన అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి ఆయనను రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో చాలామందిపై ఆరోపణలు రావడంతో వారందరిపైనా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Also Read : పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు..! కట్ చేస్తే దిమ్మతిరిగిపోయే మోసం.. హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ ఫ్రాడ్