Tuition Master Molests Student : విద్యార్ధినిపై లైంగిక దాడి చేసిన ట్యూషన్ మాస్టర్

పరీక్షల సమయంలో  తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చిన విద్యార్ధిని (16) పట్ల బయోలజీ మాస్టర్ అత్యాచార యత్నం చేశాడు. 

Tuition Master Molests Student : విద్యార్ధినిపై లైంగిక దాడి చేసిన ట్యూషన్ మాస్టర్

Teacher Molests Student

Updated On : October 10, 2021 / 2:01 PM IST

Tuition Master Molests Student :  పరీక్షల సమయంలో  తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చిన విద్యార్ధిని (16) పట్ల బయోలజీ మాస్టర్ అత్యాచార యత్నం చేశాడు.  పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా‌లోని ఎక్‌పాల్‌బోర్ ప్రాంతంలో 40 ఏళ్లుండే బయోలజీ మాస్టర్ నివసిస్తున్నారు.

పరీక్షలు దగ్గరకు వస్తూ ఉండటంతో అతని వద్దకు 16 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు  వెళ్తోంది. ఈ క్రమంలో  ఒకరోజు ట్యూషన్‌కు  వచ్చిన బాలికపై  ట్యూషన్  మాస్టర్ లైంగిక దాడి చేసాడు. ట్యూషన్  చెపుతున్నప్పుడు  వారిద్దరూ ఒంటరిగా ఉండటంతో బాలికను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోబోయాడని  బాలిక తన తండ్రికి ఫిర్యాదు చేసింది.

Also Read : Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

బాలిక ఫిర్యాదుతో ఆమె తండ్రి అక్టోబర్ 7న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  బయోలజీ మాస్టర్ తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తన ఫిర్యాదులో పేర్కోన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్యూషన్ మాస్టర్ పై పోక్సో చట్టం కింద, ఐపీసీలోని అత్యాచారయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బాలికను త్వరలో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.