పెరూలో బస్సు ప్రమాదం…8మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2019 / 11:40 AM IST
పెరూలో బస్సు ప్రమాదం…8మంది మృతి

Updated On : April 20, 2019 / 11:40 AM IST

పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.రెండు రోజుల క్రితం గన్ తో కాల్చుకొని చనిపోయిన మాజీ అధ్యక్షుడు అలన్ గ్రేసియా సంతాప కార్యక్రమానికి హాజరయ్యేందుకు  అమెరికన్‌ పాపులర్‌ రివల్యూషనరీ అలియన్స్‌(ఏపీఆర్‌ఏ) పార్టీకి చెందిన బృందం వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.

రాజధాని లిమాకు 93మైళ్ల దూరంలోని హుఆరాలోని పాన్-అమెరికన్ హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా,45 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. 
Also Read : వీడియో వైరల్: రాంగ్‌రూట్‌లోకి వచ్చి.. ఎలా బెదిరిస్తున్నారో చూడండి..