Online Loan App : మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు

లోన్ యాప్ కంపెనీల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.

Online Loan App : మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు

Loan App Harassement

Updated On : December 22, 2021 / 5:19 PM IST

Online Loan App :  లోన్ యాప్ కంపెనీల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. గత వారం రోజుల్లో ఆరు కేసులు నమోదు చేశామని వినియోగ దారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 2 కేసుల్లో  లోన్ తీసుకోకుండానే కట్టమని వేధిస్తున్నారని ఆయన తెలిపారు.

తెలంగాణ, హైదరాబాద్‌లలో  లోన్ యాప్ కంపెనీలకు చెక్ పెట్టామని… అవి వేరే రాష్ట్రాలలో ఉండి కార్యకలాపాలు  నిర్వహిస్తున్నాయని తెలిపారు.   ప్రైవేట్  లింక్స్ పంపి లోన్ యాప్ మాఫియా కొత్త మోసాలకు తెర తీసిందని, యాప్ డౌన్ లోడ్ లోనే జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. మీ ఫోన్ లో ఉండే ఇతర కాంటాక్ట్స్ తో యాక్సిస్ అడిగే ఏ యాప్ ను వేసుకోకుండా ఉంటే మంచిదని ఆయన చెప్పారు.

Also Read : YS Jagan Mohan Reddy : రేపటి నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో సీఎం జగన్ టూర్

బెంగుళూరులో ఉండే   ఒక యువకుడు ఫ్రీక్యాష్ అనే లోన్ యాప్ ద్వారా 10 వేల రూపాయల రుణం తీసుకున్నాడు. ఇప్పుడు 60 వేలు రూపాయలు కట్టమని వేధిస్తున్నారని అతని సోదరి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  లోన్ తీసుకున్న వ్యక్తి మొబైల్ లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ మెసేజ్ లు పంపించి… మహిళలని కూడా చూడకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై బెంగుళూరులోనూ  కేసు పెట్టామని ఎవరూ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోవద్దని ఆమె సూచించారు.