couple suicide : అక్రమ సంబంధం-ఆత్మహత్యాయత్నం-అడ్డుకున్న పోలీసులు

అనంతపురం జిల్లాకు చెందిన వివాహితుడికి .. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి ప్రేమను సమాజం అంగీకరించదని భయపడి ఇద్దరూ ఆత్మహత్యా యత్నం చేయబోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులువారి యత్నాన్ని అడ్డుకున్నారు.. పురుగుల మందు తాగిన వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

couple suicide : అక్రమ సంబంధం-ఆత్మహత్యాయత్నం-అడ్డుకున్న పోలీసులు

Illegal Affair Suicide

Updated On : March 31, 2021 / 2:56 PM IST

couple who tried to commit suicide : అనంతపురం జిల్లాకు చెందిన వివాహితుడికి .. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి ప్రేమను సమాజం అంగీకరించదని భయపడి ఇద్దరూ ఆత్మహత్యా యత్నం చేయబోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులువారి యత్నాన్ని అడ్డుకున్నారు.. పురుగుల మందు తాగిన వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

జిల్లాలోని ఓడీసీ (ఓబుళదేవరచెరువు) మండలానికి చెందినఖాజాపీర్ కు భార్యా, పిల్లలు ఉన్నారు. అతనికి అదే ప్రాంతానికి చెందిన నఫ్రీన్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమేపీ ప్రేమగా మారింది. తమ ప్రేమ వ్యవహారాన్ని సమాజం హర్షించదని.. తమ పెద్దలకు అవమానంగా భావించి ఇటీవల, ఇద్దరూ ఓడీసీ నుంచి పారిపోయి వచ్చి అనంతపురం వచ్చారు.

అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నా బంధువులు వదిలిపెట్టరని భయపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పురుగుల మందు కొనుక్కుని రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఊరి చివరికి చేరుకున్నారు. చనిపోయే ముందు చివరిగా సైన్యంలో చేస్తున్న తమ బంధువుతో మాట్లాడాలనుకున్నాడు ఖాజాపీర్.

సైనికుడితో  మాట్లాడేటప్పుడు  తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశారు. సైనికుడు వెంటనే అనంతపురం రిమ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అలర్టైన పోలీసులు వారి ఫోన్ నెంబరు ఆధారంగా లోకేషన్ కనిపెట్టి కొద్ది నిమిషాల్లోనే వారున్న చోటుకు చేరుకున్నారు.

ఖాజాపీర్ అప్పటికే పురుగుల మందు తాగాడు. నఫ్రీన్ పురుగుల మందు తాగుతుండగాపోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరినీ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కుటుంబ సభ్యులకు,  బంధువులకు సమాచారం ఇచ్చారు.