Madhya Pradesh : కూతురిని తీసుకెళ్లాడని యువకుడిని సుత్తితో బాదారు..వీడియో వైరల్

సుత్తితో బాదేశారు. కాళ్లు..చేతులపై కొట్టారు. ఇంకోసారి ఇలా చేస్తావా ? అనే విధంగా కొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు..సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Madhya Pradesh : కూతురిని తీసుకెళ్లాడని యువకుడిని సుత్తితో బాదారు..వీడియో వైరల్

Mp

Updated On : September 14, 2021 / 9:57 AM IST

Man Beaten Up With Hammer  : ప్రియురాలితో జంప్ అయ్యాడు. కుటుంబసభ్యులు గమనించి…అతడిని పట్టుకున్నారు. ఎలా కొట్టారంటే..మాములుగా కొట్టలేదు. సుత్తితో బాదేశారు. కాళ్లు..చేతులపై కొట్టారు. బాధతో అతను అల్లాడుతున్నా..పట్టించుకోలేదు. ఇంకోసారి ఇలా చేస్తావా ? అనే విధంగా కొట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు..సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

Read More : Corona : కరోనా వైరస్ కు ముగింపు లేనట్లేనా?!

పుష్పక్ భవ్ సార్ (22) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజపూర్ జిల్లాలోని మాక్సి సిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతను స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించసాగాడు. పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ..కుటుంబసభ్యులు ఒప్పుకోరని భావించి..ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఇరు కుటుంబాలకు ఈ విషయం తెలిసింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయంలో పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఇద్దరూ విడివిడిగా ఉండేందుకు పెద్దలు నిర్ణయించారు. తిరిగి ఎవరింటికి వారు చేరుకున్నారు.

Read More : American Flag : పిల్లిని కాపాడిన అమెరికా జెండా

కానీ..ఈ ఘటనపై అమ్మాయి తండ్రి, సోదరుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆదివారం మార్కెట్ ప్రాంతానికి పుష్పక్ ఒక్కడే వచ్చాడని తెలుసుకున్నారు. అమాంతం ఇద్దరూ అక్కడకు చేరుకున్నారు. పట్టుకుని కిందపడేశారు. తండ్రి సుత్తి తీసుకుని మోకాళ్లు, చేతులపై బాదసాగాడు. సోదరుడు అతడిని గట్టిగా పట్టుకున్నాడు. బాధతో విలవిల్లాడుతున్నా..పుష్పక్ ను వదిలిపెట్టలేదు. అక్కడనే అతను సెల్ ఫోన్ లో దాడి దృశ్యాలను బంధించాడు. Anurag Dwary అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. వెంటనే పోలీసులు స్పందించాలని కోరుతున్నారు. మాక్సి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.