Car Accident : మాదాపూర్‌లో అదుపు తప్పిన ఆడి కారు….ఒకరు మృతి

హైదరాబాద్ మాదాపూర్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Car Accident : మాదాపూర్‌లో అదుపు తప్పిన ఆడి కారు….ఒకరు మృతి

Madhapur Car Accident

Updated On : June 27, 2021 / 9:50 PM IST

Car Accident : హైదరాబాద్ మాదాపూర్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. మాదాపూర్ లోని ఐకియా- మై హోం అంబ్రా మార్గంలో వేగంగా వచ్చిన ఆడికారు అదే మార్గంలో వెళుతున్న ఆటోను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వై ఉమేష్ కుమార్(37) ఆటోలోంచి ఎగిరి ఫుట్ పాత్ పై పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఉమేష్ అక్కడికక్కడే మరణించాడు. ఆటో డ్రైవర్ శ్రీను‌కు గాయాలయ్యాయి. కారు నడిపిన వ్యక్తి కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు.

కారు ఉప్పల్ కు చెందిన వాకిటి రఘునందన రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు కారు నడిపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.