Murder For Towel: దారుణం.. స్నానం అయ్యాక వెంటనే టవల్‌ ఇవ్వలేదని భార్య హత్య

స్నానం చేశాక అడిగిన వెంటనే టవల్‌ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Murder For Towel: దారుణం.. స్నానం అయ్యాక వెంటనే టవల్‌ ఇవ్వలేదని భార్య హత్య

Murder For Towel

Updated On : November 8, 2021 / 8:57 PM IST

Murder For Towel: స్నానం చేశాక అడిగిన వెంటనే టవల్‌ ఇవ్వలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. బాలాఘాట్​ జిల్లా కిర్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపుర్​ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా సోమవారం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖకు చెందిన ఉద్యోగి రాజ్​కుమార్​ బాహే(50) శనివారం సాయంత్రం స్నానం చేసిన తర్వాత భార్య పుష్పా బాయ్​ (45)ను టవల్​ అడిగాడు.

Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు

అయితే ఆ సమయంలో ఆమె పనిలో ఉంది. టవల్ కోసం కాసేపు ఆగాలని భర్తతో చెప్పింది. ఆ సమయంలో ఆమె వంట పాత్రలు శుభ్రం చేస్తోంది. అంతే, భార్య అలా చెప్పడంతో భర్తకు పట్టరాని కోపం వచ్చింది. అదే కోపంలో అతడు విచక్షణ కోల్పోయాడు. భార్య తలపై అక్కడే ఉన్న పారతో పదే పదే కొట్టాడని కిర్ణాపూర్ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేంద్ర కుమార్‌ బారియా తెలిపారు. భర్త దాడిలో తలకు తీవ్ర గాయాలు కావడంతో పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది.

FB Own Survey : ఫేస్‌బుక్‌‌తో 36 కోట్ల మందికి రిస్క్!

తండ్రి ఘాతుకాన్ని 23ఏళ్ల కూతురు అడ్డుకోవడానికి ప్రయత్నించింది. అడ్డొస్తే చంపేస్తానని తండ్రి బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై హత్య కేసు నమోదు చేశారు.