భార్యపై అక్రమ సంబంధం అనుమానం : కూతుర్ని రేప్ చేసి చంపిన తండ్రి

అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. అగ్ని సాక్షిగా తాళికట్టిన భార్య శీలాన్ని శంకించి..కన్నకూతుర్ని రేప్ చేసి హత్య చేశాడు ఓకసాయి తండ్రి. ఉత్తర ప్రదేశ్ లోని బరేలిలో ఈ దారుణం జరిగింది. బరేలిలోని స్ధానిక ఫతే గంజ్ వెస్ట్ పోలీసు స్టేషన్ కు మార్చి 28న వ తేదీన, తన కుమార్తె కనిపించటం లేదని ఒక తండ్రి ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లాక్ డౌన్ టైంలో 8 ఏళ్ల చిన్న పిల్ల ఎక్కడ తప్పిపోయిందా అని పోలీసులు అంతా గాలించారు. కాగా 29 వతేదీ రాత్రి తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని ఫిర్యాదు దారు పక్కన ఇంటి మరుగు దొడ్డిలో కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read | కాలేజీ విద్యార్ధినిపై అత్యాచారం కేసులో నటుడి కుమారుడు అరెస్ట్
బాలిక తండ్రి స్ధానికంగా ఉన్న ఒక యువకుడిపై అనుమానం వ్యక్తంచేశాడు. ఆయువకుడి వద్ద బాలిక తండ్రి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. ఆర్ధిక కారణాలతో ఆ యువకుడే నేరం చేసి ఉంటాడని అతను పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు బాలిక తల్లిని ప్రశ్నించారు.
Also Read | భార్య ఫోన్ కు మిస్డ్ కాల్ : గొంతు పిసికి హత్య చేసిన భర్త
తన భర్తే ఈ హత్య చేసి ఉంటాడనే అనమానం అతని భార్య వ్యక్త పరిచింది. భార్య చెప్పిన ఆధారాలతో బాలిక తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమ దైన స్టైల్లో విచారించారు. దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు. పోస్టు మార్టం రిపోర్టులో కూడా బాలిక తండ్రే హత్య చేసినట్లు తేలింది.
నిందితుడికి తన భార్య శీలంపై అనుమానం ఉండేది. హత్యకు గురైన 8 ఏళ్ల బాలిక తనకు పుట్టలేదని…భార్యకి వేరోకరితో అక్రమ సంబంధం వల్ల ఆ బాలిక పుట్టిందనే అనుమానం ఉంది. దీంతో నిందితుడు బాలికను రేప్ చేసి హత్యచేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హజరు పరిచి ఏప్రిల్ 15 న జైలుకు పంపారు. ఇంతకు ముందు అరెస్ట్ చేసిన యువకుడిని నిర్దోషిగా విడుదల చేశారు.
Also Read | ఆంటీలే ఆ బీటెక్ కుర్రాడి టార్గెట్, స్నానం చేస్తుండగా 50మందిని నగ్నంగా వీడియో తీసి..