Love Cheating : ప్రేమ…పెళ్లి పేరుతో లొంగదీసుకుని …..

తనతో పాటు పదవ తరగతి చదివిన యువతిని   ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని సన్నిహితంగా మెలిగి మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.

Love Cheating : ప్రేమ…పెళ్లి పేరుతో లొంగదీసుకుని …..

Sexual Abuse

Updated On : November 28, 2021 / 2:46 PM IST

Love Cheating :  తనతో పాటు పదవ తరగతి చదివిన యువతిని   ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని సన్నిహితంగా మెలిగి మోసం చేసిన యువకుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.

విజయవాడ సమీపంలోని పోరంకి  సాలిపేటకు చెందిన  యువతి(24)ని  అదే గ్రామానికి చెందిన కోలా  బలరామ్ కళ్యాణ్ ప్రేమ పేరుతో వెంటపడ్డాడు.  వీరిద్దరూ టెన్త్ క్లాసులో క్లాస్‌మేట్స్. యువతి  మొదట ఒప్పుకోలేదు.  నువ్వులేకపోతే నేను చచ్చిపోతానని బలరాం బెదిరించటంతో అతడ్ని నమ్మిన యువతి ప్రేమను అంగీకరించింది.
Also Read : Rave Party : కూకట్‌పల్లిలో రేవ్‌పార్టీని భగ్నం చేసిన పోలీసులు
తదనంతరం వారిద్దరూ పలుమార్లు సన్నిహితంగా మెలిగారు. యువతి పెళ్ళి ప్రస్తావన తీసుకురాగా బలరాం తన ఇంట్లో  పెళ్లి విషయం చెప్పాడు.  అతను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోటానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో బాధితురాలు బలరాంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.