Matrimony Fraud : మ్యాట్రిమోని సైట్‌లో ఘరానా మోసం, యువతి నుంచి రూ.22లక్షలు దోచేశాడు
మ్యాట్రిమోని సైట్లలో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ అప్‌లోడ్ చేసి.. పెళ్లి పేరుతో చీట్ చేస్తున్నారు. లక్షలు దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అ

Matrimony Fraud
Matrimony Fraud : మ్యాట్రిమోని సైట్లలో ఘరానా మోసాలు జరుగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు నకిలీ ప్రొఫైల్స్ అప్‌లోడ్ చేసి.. పెళ్లి పేరుతో చీట్ చేస్తున్నారు. లక్షలు దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో అలాంటి ఘరానా మోసం ఒకటి వెలుగుచూసింది. పెళ్లి చేసుకుందాం, అమెరికాలో సెటిల్ అవుదాం అంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి రూ. 22 లక్షలు దోచుకున్నాడు.
Typhus Vaccine : పేన్లతో ఏ వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసారో తెలుసా??
సికింద్రాబాద్ కు చెందిన యువతి పెళ్లి కోసం మ్యాట్రిమోని సైట్ లో రిజిస్టర్ చేసుకుంది. యువతి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అదే సైట్ లో పొట్లూరి బాలవంశీకృష్ణ అనే వ్యక్తి కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా యువతిని పరిచయం చేసుకున్నాడు. యూఎస్ లో పెళ్లి చేసుకుని స్థిరపడదామని ఆమెను నమ్మించాడు. ఆ యువతి అతడి మాటలు పూర్తిగా నమ్మేసింది. వీసా కోసం రూ.22.70 లక్షలను తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజస్వరూపం బయటపెట్టాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన యువతి లబోదిబోమంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమై మాయ మాటలతో దోపిడీకి పాల్పడుతున్న నైజీరియన్ సైబర్ ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు.. యూరోపియన్ దేశస్తులుగా చెప్పుకుంటూ.. ఇంటర్‌నెట్ నుంచి అందమైన అబ్బాయిల ఫొటోలు తీసి.. మ్యాట్రిమోని సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ కారణాలు చెప్పి.. బాధితుల నుంచి పలు దఫాలుగా రూ. 23.3 లక్షలు కాజేశారు.
World Safest City: ప్రపంచంలో సురక్షితమైన నగరం కోపెన్ హాగెన్..ఎందుకంటే..
ఇలాంటి నేరాలు జరుగుతున్న క్రమంలో మ్యాట్రిమోని సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుడ్డిగా ఎవరినీ నమ్మొద్దన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.