ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం : ఇద్దరు మృతి

  • Published By: madhu ,Published On : November 24, 2019 / 01:02 AM IST
ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం : ఇద్దరు మృతి

Updated On : November 24, 2019 / 1:02 AM IST

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా.. జనగామ జిల్లా చీటూరు దగ్గర ఆయన కాన్వాయ్ అదుపు తప్పింది. కారు బోల్తా పడటంతో.. డ్రైవర్ పార్థసారథి, ఎర్రబెల్లి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతి చెందారు. మరో ముగ్గురు అనుచరులకు గాయాలయ్యాయి. వారికి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఎర్రబెల్లి ప్రయాణిస్తున్న కారు వెనకాల ఉన్న కారుకు ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ.. ఆ కారులో మంత్రి దయాకర్ రావు లేకపోవడంతో.. ఆయనకు ప్రమాదం తప్పింది. మంత్రి దయాకర్ రావు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
Read More : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ ప్రమాదంపై మంత్రి కేటీఆర్‌ దిగ్భ్రాంతి