Minor girl taken hostage : మైనర్ బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం. అమ్మకానికి యత్నం
ఉత్తర ప్రదేశ్ మీరట్ జిల్లాలోని సర్ధన పోలీసు స్టేషన్ పరిధిలోని కాంకర్ ఖేర్ ప్రాంతంలో 15 ఏళ్ల మైనర్ బాలికను ఆమె తల్లి విక్రయించటానికి ప్రయత్నించగా బాలిక తప్పించుకుని పోలీసుల సహాయం కోరిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

Minor Girl Taken Hostage
Minor girl taken hostage, gang-raped for over a month in Meerut : ఉత్తర ప్రదేశ్ మీరట్ జిల్లాలోని సర్ధన పోలీసు స్టేషన్ పరిధిలోని కాంకర్ ఖేర్ ప్రాంతంలో 15 ఏళ్ల మైనర్ బాలికను ఆమె తల్లి విక్రయించటానికి ప్రయత్నించగా బాలిక తప్పించుకుని పోలీసుల సహాయం కోరిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
సర్దన పోలీసులు అందించిన వివరాల ప్రకారం బాలిక తల్లి మొదట రాధ్నా గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడితో విడిపోయిన తర్వాత …ఆమె ఐదుగురు పిల్లలు ఉన్న సైన్యంలో పని చేసే ఉద్యోగిని రెండవ వివాహం చేసుకుంది.
తనరెండవ భర్త మరణించిన తర్వాత ఆ మహిళ మూడో వివాహం చేసుకుంది. అతనితో కలిసి కంకర్ ఖేరా లో నివసిస్తోంది. అతని మిత్రులు ఇద్దరు వీరింటికి వచ్చేవారు. వారి చూపు బాలిక మీద పడింది. బాలిక తల్లితో మాట్లాడి జనవరి 28న … ఆమెను వారింటికి తీసుకువెళ్లారు.
అక్కడ బాలికకు నిద్రమాత్రలు ఇచ్చి బాలికపై ఒకటిన్నర నెలలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లితో కలిసి బాలికను అమ్మకానికి పెట్టిన విషయం తెలుసుకున్న బాలిక వారి చెర నుంచితప్పించుకుని మార్చి 13న సర్ధన పోలీసు స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేసింది. బాలిక చెప్పిన వివరాలతో ఆమెతల్లి. మరో ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తల్లిని సహ కుట్రదారుగా చేర్చారు.