రెండు యుద్ధ విమానాలు ఢీ

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 07:09 AM IST
రెండు యుద్ధ విమానాలు ఢీ

కర్నాటక : ఎయిర్ ఇండియా షో రిహార్సల్స్ లో అపశృతి చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పింది. బెంగళూరులో రెండు సూర్య కిరణ్ యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. గాల్లో రెండు ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టు్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. యలహంక ఎయిర్ బేస్ వద్ద ఎయిర్ ఇండియా షో రిహార్సల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పైలెట్లు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అధికారులతోపాటు అందరూ ఊపరి పీల్చుకున్నారు. 2019, ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ బెంగళూరులో ఏరో ఇండియా షో జరగనుంది.

 

ఒక దాంట్లో ఇద్దరు, మరొక ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒక ఫైలట్ ఉండగా ముగ్గురు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు.ప్రాక్టీస్‌లో భాగంగా సారంగ్, సూర్య కిరణ్స్, యకోవ్లెవ్స్‌లుగా విడిపోయి కార్యక్రమంలో అధికారులు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ సంబరాలు జరగనున్నాయి.