Gurugram : గురుగ్రామ్ మసీదుపై గుంపు దాడి..మసీదు దహనం, ఒకరి మృతి

హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి హింసాకాండలో ముగ్గురు మృతి చెందగా, మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అనంతరం గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేసి మసీదుకు నిప్పంటించింది....

Gurugram : గురుగ్రామ్ మసీదుపై గుంపు దాడి..మసీదు దహనం, ఒకరి మృతి

Mob fires at mosque

Updated On : August 1, 2023 / 11:56 AM IST

Gurugram :హర్యానాలోని నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి హింసాకాండలో ముగ్గురు మృతి చెందగా, మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అనంతరం గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేసి మసీదుకు నిప్పంటించింది.

China Heavy Rain : చైనాలో భారీవర్షాలు..11మంది మృతి, 27 మంది గల్లంతు

ఈ ఘటనలో ఒకరు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. (Mob fires at mosque) మసీదు వద్ద రాళ్లు రువ్వడంతో పాటు గుంపు మసీదులోకి ప్రవేశించి నిప్పు పెట్టారు. (Gurugram sets it ablaze) మసీదుపై దాడి ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని ఈస్ట్ డీసీపీ నితీష్ అగర్వాల్ చెప్పారు. హర్యానా రాష్ట్రంలో పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్రం 20 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.

Indian Woman Missing : క్రూయిజ్ షిప్‌లో భారతీయ మహిళ అదృశ్యం

హర్యానా ప్రభుత్వం సోమవారం నుహ్, గురుగ్రామ్‌లలో సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద నిషేధ ఉత్తర్వులు విధించింది. సోమవారం అర్థరాత్రి నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్‌లోని పాఠశాలలను మంగళవారం మూసివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో శాంతి సామరస్యాన్ని కొనసాగించాలని ప్రజలకు మనోహర్ లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖట్టర్ తెలిపారు.