Road Accident : శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి

సంగారెడ్డి జిల్లాలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Road Accident : శుభకార్యానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. తల్లీకూతురు మృతి

Accident (1)

Updated On : December 12, 2021 / 9:58 PM IST

Mother and daughter killed : సంగారెడ్డి జిల్లాలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారు. మరో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాడు. ఈ సంఘటన గుమ్మడిదలలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం…గుమ్మడిదలకు చెందిన బ్రహ్మచారి ఆదివారం ఉదయం ఓ శుభకార్యానికి భార్య కల్పన (35), కూతురు శివానీ(4), కుమారుడు కార్తీక్ (2)తో బైక్ పై వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో మార్గంమధ్యలో నేషనల్ హైవే 765 దోమడుగు యూటర్న్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Ambati Rambabu : విశాఖ స్టీల్ ప్లాంట్ పై పవన్ బీజేపీని ఎందుకు ప్రశ్నించరు..? : అంబటి

దీంతో భార్య, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.కొడుకు కార్తీక్‌కు తీవ్ర గాయాలవ్వగా, బ్రహ్మచారి స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

తల్లీకూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయకృష్ణ తెలిపారు.