విజయవాడలో ఉద్రిక్తం : CAA, NRCకి వ్యతిరేకంగా ముస్లిం మహిళల ధర్నా

  • Published By: chvmurthy ,Published On : February 25, 2020 / 02:20 PM IST
విజయవాడలో ఉద్రిక్తం : CAA, NRCకి వ్యతిరేకంగా ముస్లిం మహిళల ధర్నా

Updated On : February 25, 2020 / 2:20 PM IST

విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది.  CAA NRC కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాత‌బ‌స్తీలోని పంజా సెంటర్ వద్ద పెద్ద సంఖ్య‌లో ముస్లిం మ‌హిళ‌లు మంగళవారం సాయంత్రం ఆందోళ‌న‌ చేపట్టారు.  పెద్ద ఎత్తున బయటకి వచ్చిన మహిళలు రోడ్డుపై భైఠాయించి నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు.  ధర్నాకు అనుమతి లేదని పోలీసులు మహిళలు అడ్డుకుంటున్నారు.  ఈసమయంలో  పోలీసులకు ముస్లిం మహిళలకు  మధ్య తీవ్ర వాగ్వాదం  జరిగింది. మహిళలను  అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. 

vja muslim ladies