మయన్మార్ లో ఘోర ప్రమాదం…50మంది మృతి

మయన్మార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కాచిన్ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి 50 మందికిపైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, మంగళవారం రెస్క్యూ వర్కర్స్ ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక శాసన సభ్యుడు టిన్ సోయి తెలిపారు.మిగిలిన వారు బతికిఉండే అవకాశాలు చాలా తక్కువని తెలిపారు. ప్రమాదాన్ని మయన్మార్ సమాచార మంత్రిత్వ శాఖ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. చైనా సరిహద్దుల్లో రంగురాళ్ల కోసం నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాల వల్ల కొండచరియలు విరిగిపడి ప్రతి ఏటా చాలా మంది మరణిస్తున్న విషయం తెలిసిందే.